'ట్రైనింగ్ కోసమని ఇక్కడకు వస్తే తిండి కూడా దొరకడంలేదు'

by Sridhar Babu |
ట్రైనింగ్ కోసమని ఇక్కడకు వస్తే తిండి కూడా దొరకడంలేదు
X

దిశ,కరీంనగర్: శిక్షణ కోసం మహారాష్ట్రకు వెళ్లిన 28 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ (ముంబై సమీపంలోని టౌన్)కు తెలంగాణలోని కరీంనగర్ తో పాటు పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు అగ్రికల్చర్ హెల్త్ కేర్ ట్రైనింగ్ కోసం వెళ్లారు. లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో వీరు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. దీంతో తమను స్వరాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ వీడియోలు పంపించారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో దాదాపు మూడు నెలలుగా ఆశ్రయం పొందినా.. తమకు సరిగ్గా తిండి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా నిరాకరించడంతో తామంతా ఇక్కడే చిక్కుకుని పోయామని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమను స్వస్థలాలకు రప్పించాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed