- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షార్జాలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
దిశ, కరీంనగర్: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి పయనమయిన వారంతా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు లేక నరకయాతన పడుతున్నారు. తెలంగాణలోని జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 37మంది షార్జాలో చిక్కుకున్నారు. ఈ మేరకు వారు ‘దిశ’కు సమాచారం అందించారు. వీరంతా బతుకుదెరువు కోసం యూఏఈలోని షార్జాకు వెళ్లారు. కరోనా ప్రభావంతో వీరిని కంపెనీలోంచి తీసేశారు. దీంతో ఉపాధి కరువైంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. తినడానికి తిండి లేదు. ఎటైనా వెళ్దామంటే కరోనా ఆంక్షలు. ఇవన్నీ వెరసి దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం అడిగితే, కరోనా తగ్గిన తరువాత ఇస్తామని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమకు షెల్టర్ ఇచ్చిన చోట ఈ నెల 20వరకు గడువు ముగియనుందనీ, ఆలోగా డబ్బులు చెల్లించకపోతే వెళ్లగొడతారని వాపోతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Tags: people, trapped, Sharjah, medak, kamareddy, nirmal, mancherial, corona