IT సెక్టార్‌లో దూసుకుపోతున్న తెలంగాణ..

by Shyam |   ( Updated:2021-09-17 01:59:57.0  )
IT సెక్టార్‌లో దూసుకుపోతున్న తెలంగాణ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇండియన్ ఎకానమిలో ఐటీ వాటా 1.95 బిలియన్ డాలర్లు.. ఎగుమతుల్లో 1.50 బిలియన్ డాలర్లు అని, ఐటీ ఇండస్ట్రీ ఆరేళ్ల తర్వాత డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ రేట్‌ సాధించనుందని నాస్కామ్‌ చైర్‌పర్సన్‌ రేఖా మీనన్‌ అన్నారు. జీడీపీలో 8 శాతం ఐటీ సెక్టార్‌ నుంచి సమకూరుతుందన్నారు. కరోనా పాండమిక్‌ టైంలోనూ ఐటీ రంగంలో వృద్ధి కొనసాగిందన్నారు. గడిచిన 18 నెలలుగా ఇండస్ట్రీ అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొందన్నారు.

దేశవ్యాప్తంగా 4.50 లక్షల బిలియన్‌ల ఉద్యోగులు ఉన్నారని, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్షంగా ఉపాది పొందుతున్నారని తెలిపారు. ఇన్నోవేషన్‌ టెక్నాలజీలో తెలంగాణ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. నాస్కామ్‌ తెలంగాణ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కలిసి పనిచేస్తుందన్నారు. సీఎస్సార్‌లో భాగంగా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కరోనా సమయంలో సేవలందించామని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాల్లో 120 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.

సాస్, ఏఐ, ఈ-కామర్స్, క్వాంటం కంప్యూటింగ్ మొదలైన వాటిలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెద్ద వృద్ధి అవకాశాలు వస్తున్నాయి. వీటి దృష్టి కేంద్రీకృత పెట్టుబడులు, వ్యాపారం, సాంకేతికత.. ప్రభుత్వం నుంచి సంయుక్త ప్రయత్నాలు అవసరం అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రభుత్వం ఇప్పటికే కొత్త ఐసీటీ పాలసీలో నిర్మాణాత్మక మార్పులను సృష్టించడంలో సహాయపడే విధానాలను అమలు చేసిందని దానికి పూర్తి సహకారం అందజేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed