- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ పై విరుచుకుపడిన మంత్రి ఎర్రబెల్లి..
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేతలు ఏం సాధించారని రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారని.. విభజన చట్టంలోని హామీలను విస్మరించినందుకా.. కోచ్ ప్యాక్టరీ.. గిరిజన యూనివర్సిటీ.. బయ్యారం ఉక్క కార్మాగారం తేనందుకా? దేనికి యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కోచ్ ప్యాక్టరీ తెచ్చాకే తెలంగాణలో తిరగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతం లో కాంగ్రెస్ మోసం చేసింది.. ఇపుడు బీజేపీ మోసం చేస్తోంది దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని..కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ,తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ,ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా విభజన చట్టం లో ఉన్నాయని ఈ మూడు ప్రధాన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఈ హామీలు సాధించకుండా బీజేపీ నేతలు సిగ్గు శరం లేకుండా పాదయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించాకే బీజేపీ నేతలు తెలంగాణ లో తిరగాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బోగస్ మాటలు చెప్పే బండి సంజయ్.. అబద్దాలు చెప్పే అరవింద్.. బోగస్ మాటలు.. ప్రజలను రెచ్చగొట్టే బీజేపీకి మొదడుంటే విభజనచట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు. గత ఏడేళ్లుగా బీజేపీకి తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణకు మంజూరుచేయలేదని.. నలుగురు ఎంపీలుగా, కేంద్ర మంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కళాశాలను తీసుకురాలేని దద్దమ్మలు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర లాతూర్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు మాయ మాటలు మానుకొని తెలంగాణ కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. ఆ పోరాటానికి సంపూర్ణమద్దతు తెలుపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత ఇంకెన్నాళ్లు ? అని ప్రశ్నించారు. రైతులను కూడా కేంద్రం మోసం చేస్తోందని, వరి దొడ్డు రకాలు కొనమని చెప్పడం రైతులను దగా చేయడమేనని మండిపడ్డారు. బీజేపీ నేతలవన్నీ అబద్దపు మాటలు.. మోసం వారి నైజ అని ఆరోపించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. గతం లో కాంగ్రెస్ కాజీ పేట కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ని పంజాబ్ కు తరలిస్తే ఇపుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు. బండి సంజయ్ తన పాద యాత్ర ను ఢిల్లీ వైపు మార్చి తెలంగాణ కు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ..తెలంగాణ వంచన యాత్ర అని ఆరోపించారు. వరంగల్ లో సంజయ్ పాద యాత్ర కు ముందే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని, లేదంటే ప్రజలు సంజయ్ ను ప్రతిఘటిస్తారన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దొంగచాటున రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని కేంద్రం మహారాష్ట్ర లాతూర్ కు తరలించిందని ఆరోపించారు.రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిన తరువాతనే బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరగాలన్నారు. హుజూరాబాద్ లో బీజేపీ కి ఓట్లడిగె హక్కు లేదని స్పష్టం చేశారు.
ధర పెరిగేవరకు ధాన్యం దాచుకున్నా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్
గతేడాది వానాకాలంలో నేను సన్నరకం సాగుచేశా. గిట్టుబాటు ధర లేకపోవడంతో నాలుగు నెలలపాటు ధాన్యం నిల్వ చేసుకొని అమ్ముకున్న. గతేడాది కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేసి రైతుకు మద్దతుగా నిలిచాం. కానీ ఈ ఏడాది కేంద్రం దొడ్డురకం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. ఎన్నివేల కోట్లు అయినా దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఏం చేయాలో, ఎక్కడ నిల్వ చేయాలో అర్ధం కావడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోంది. కేంద్రం 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా బాగుంటుంది. వరికి ప్రత్యామ్నాయపంటలు వేస్తే సబ్సిడీ పెంచితే రైతు మొగ్గుచూపుతాడమోననే ఆలోచన చేయాలని సీఎం కోరతాం. రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం.