- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై అల్లం నారాయణ ఆసక్తికర కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించింది విద్యార్థులేనని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను ఆదివారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అల్లం నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల పోరాటంతోనే ఉద్యమం మరింత ఉధృతం అయిందని తెలంగాణ సాధించామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ మధ్య కృష్ణా జలాలపై విడుదల చేసిన గెజిట్ విషయంలో కేంద్రం వివక్ష చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మోడీ సర్కార్ విచ్ఛిన్న తరహా పాలన సాగుతుందని ఆరోపించారు. యూపీలో దళితులపై దాడులు జరుగుతుండడం శోచనీయం అన్నారు. దళితులను పూర్తిగా అణిచివేతకు బీజేపీ చూస్తుందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ హక్కులను కూడా కాలరాస్తుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ చెప్పిన పంచ సూత్రాలకి అనుగుణంగా పాలన చేస్తుందని వెల్లడించారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను అదుపు చేయడంలో కేంద్ర విఫలమైందన్నారు. నాలుగేళ్లలో కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టు కట్టుకున్నామన్నారు. రాష్ట్రాల హక్కులను కబళించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఆరోపించారు. రైతాంగంపై కూడా బీజేపీ చిన్నచూపు చూస్తోందన్నారు. ఢిల్లీ శివారులో ఇంకా రైతులు పోరాటం చేస్తున్నారని వారి డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్ర వ్యవసాయ చట్టాలను సారించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ జేఏసీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి మన హక్కులను కాలరాసే కుట్రలను అణిచివేయాలని, తెలంగాణ హక్కుల కోసం విద్యార్థి విభాగం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబాబు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.