అగ్రిగోల్డ్ కేసు విచారణకు హైకోర్టు అంగీకారం

by srinivas |
Telangana High Court
X

దిశ, వెబ్‎డెస్క్: అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కేసు విచారణకు జస్టిస్ ఎస్.రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ఎదుట ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్‎లను హైకోర్టు మెన్షన్ చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిపేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తరఫున తిరిగి చెల్లించేందుకు అనుమతించాలన్న పిటిషన్ ను విచారించాలని అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, నిధులు పంపిణీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.

Advertisement

Next Story