రైతులకు ఏఐ ఆధారిత సేవల కోసం వింగ్‌స్యూర్‌తో ఒప్పందం!

by Shyam |
telangana government MOU
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన వెంగ్‌స్యూర్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని చిన్న రైతులకు టెక్నాలజీ ఆధారిత బీమా ఉత్పత్తులు, సలహా సేవలను ఈ కంపెనీ అందిస్తుంది. వ్యవసాయ రంగంలో ఇలాంటి ఒప్పందం జరగడం ఇదే మొదటిదాని, దేశీయ వ్యవసాయ రంగంలో సామజితక్, డిజిటల్ వ్యాప్తిని ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని వింగ్‌స్యూర్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సంస్థ ఆర్థిక సాధికారత, సహకారం, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనను అందించే ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతు ఇవ్వనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో దీని అమలును సులభతరం చేయనుంది. వ్యవసాయ శాఖ తనకున్న నెట్‌వర్క్ ద్వారా డేటా సేకరణతో పాటు రైతులకు శిక్షణ, సలహా సేవలకు ప్రాధాన్యత ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed