గవర్నర్ తమిళిసై విజ్ఞప్తికి సానుకూల స్పందన

by Shyam |
గవర్నర్ తమిళిసై విజ్ఞప్తికి సానుకూల స్పందన
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విషయమై గవర్నర్ తమిళిసై తాజాగా మరోసారి స్పందించారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. మరిన్ని వెంటిలేటర్లు పంపించాలంటూ ఆమె కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆమె కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తో చర్చించారు. ఈఎస్ఐ ఆసుపత్రికి మరిన్ని వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు పంపించాలన్నారు. తమిళిసై విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి.. గవర్నర్ కోరినవే కాదు.. అదనంగా రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమిళిసై కేంద్రమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed