- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అలర్ట్.. స్ట్రెయిన్ ఎఫెక్ట్
దిశ, తెలంగాణ బ్యూరో : బ్రిటన్‌లో కరోనా కొత్త రూపు స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో తెలంగాణ కూడా అప్రమత్తమైంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విమానం దిగగానే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను, సర్వియలెన్స్ సిబ్బందిని నియమించారు. బ్రిటన్ నుంచి వచ్చేవారందరికీ టెస్టులు చేయడంతోపాటు పాజిటివ్ ఉంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు, నెగెటివ్ ఉంటే హోమ్ క్వారంటైన్‌కు పంపేలా నిర్బంధ విధానాన్ని తీసుకొచ్చారు. కచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గత రెండు వారాలలో బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారి వివరాలను కూడా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేకరిస్తున్నారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
శంషాబాద్ విమానాశ్రయానికి బ్రిటన్ నుంచి రోజూ నేరుగా రెండు విమానాలు, దుబాయ్ తదితర దేశాల మీదుగా 11 విమానాలు వస్తున్నాయి. సగటున 600 మంది ప్రయాణికులు వస్తున్నారు. ఇప్పటికే వచ్చినవారి వివరాలను వైద్యారోగ్య సిబ్బంది సేకరిస్తున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా ఎయిర్‌పోర్టులో కరోనా పీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఆ దేశాల నెగిటివ్ సర్టిఫికెట్‌తో వచ్చినప్పటికీ ఇక్కడ కూడా కచ్చితంగా టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కొత్త వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం, అక్కడి నుంచి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏయిర్‌పోర్టులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 14 మందితో ప్రత్యేక వైద్య బృందాలను అక్కడే ఉంచారు. హెల్ప్ డెస్కును కూడా ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టంగా చర్యలు
ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ వచ్చిన తొలినాళ్లలో తీసుకున్న తరహాలోనే ఇప్పుడు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతుంది. ఇప్పటిదాకా సేకరించిన ప్రయాణికులు డేటాను క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బందికి పంపింది. బ్రిటన్ దేశం నుంచి ఎవరైనా వస్తే వెంటనే చుట్టుపక్కలవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ దేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కొందరు నేరుగా కాకుండా వివిధ దేశాల మీదుగా కనెక్టెడ్ ఫ్లైట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎయిర్‌పోర్టులో పాస్‌పోర్టును తనిఖీ చేస్తామని పేర్కొంది. కోవిడ్‌కు సంబంధించిన సందేహాలుంటే 104 కాల్ సెంటర్‌కు కాల్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ విమానాలు వచ్చే అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది.