- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్లు అమ్ముకోవచ్చు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కల్లు గీత కార్మికులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ గీత కార్మికులు కల్లును అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌జోన్‌లు మినహా అన్నిప్రాంతాల్లో కల్లు విక్రయాలు జరుపుకోవచ్చని, కల్లు దుకాణాలు సైతం తెరవచ్చని మెమో 6837 జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మెమో అమల్లో ఉంటుందని తెలిపింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరిచినా కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో గౌడ సంఘాలు, వృత్తిదారుల నుంచి ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం కల్లు కుండలను పగులగొట్టడంతో పాటు గీత వృత్తికి వెళ్లనివ్వకుండా చేయడంతో వారంతా అసంతృప్తికి గురయ్యారు. అక్కడక్కడ లాఠీఛార్జీలతో పాటు అరెస్టులు సైతం చోటు చేసుకున్న ఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో గౌడకుల సంఘాల నేతలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పరిస్థితి వివరించడంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గీత కార్మికులకు శుభవార్త చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ కల్లు అమ్ముకోవచ్చని సూచించారు. గీత కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నీరా కేంద్రాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, గౌడ సంఘాల నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్, అయిలి వెంకన్న గౌడ్, ప్రతాప్ గౌడ్, రమణ గౌడ్, బింగి గణేష్ గౌడ్ పాల్గొన్నారు.