- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ టైమ్.. బార్లు ఓపెన్
దిశ, వెబ్‌డెస్క్: మందు ప్రియులు, బార్ల ఓనర్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహాకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వైరస్‌తో కొద్ది నెలలుగా మూతపడ్డ వీటిని నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. బార్లు, పబ్‌లు, క్లబ్‌లు తెరిచేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా డ్యాన్సులు, మ్యూజిక్ ఈవెంట్ల పై నిషేధం విధించింది. అలాగే, పలు కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ ఓపెన్ చేసుకోవచ్చని సూచించింది.
బార్లు, క్లబ్బుల వద్ద తప్పని సరిగా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి.. క్యూ పాటిస్తూ.. శానిటైజ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పార్కింగ్ స్థలాల్లో అధికంగా జనాలు గుమికుండా చూసుకోవాలంది. అలాగే బార్ల నిర్వహాకులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. బార్లలో వెంటిలేషన్ ఉండాలని.. ప్రతి రోజు శానిటైజ్ చేస్తూనే.. కస్టమర్ వెళ్లిన తర్వాత ఆ సీటును కూడా శానిటైజేషన్ చేయించాలని ఉత్తర్వులో వెల్లడించింది. మొత్తానికి ఇన్ని నెలలు మూతపడ్డ బార్లు.. సరిగ్గా ఐపీఎల్ టైమ్‌లో తెరుచుకోవడం గమనార్హం.