ధరణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Shyam |
ధరణిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్​ ప్రక్షాళనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా తలసాని శ్రీనివాస్​యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. కన్వీనర్ గా శేషాద్రిని నియమించారు. ఈ కమిటీ ధరణి అంశాలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది

ధరణి పోర్టల్​, నిర్వహణ, డేటా అప్​లోడ్​లో అక్రమాలు, లోపాలు నెలకొన్నాయి. అతి పెద్ద సమస్యగా నిషేధిత రిజిస్ట్రేషన్ల జాబితా సవాల్​ విసురుతోంది. దశాబ్దం క్రితం కాలనీలు ఏర్పడ్డాయి. విల్లాలు నిర్మించిన ప్రాంతాలను ధరణి పోర్టల్​ అక్రమాలంటూ చెబుతోంది. అనుమతులు జారీ చేసిన జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ అధికారులపై చర్యలు తీసుకోకుండా.. వాటిని కొనుగోలు చేసిన వారిని అక్రమార్కులుగా తేల్చింది. గతంలో పట్టా భూములుగా కొనుగోలు చేసిన రైతుల చేతిలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టారు. కానీ ఇప్పుడవి ప్రభుత్వ భూములుగా నమోదు చేసి పట్టాదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ఆఖరికి మంత్రులు సైతం ప్రభుత్వంపై హైకోర్టులో కేసులు వేశారు. ధరణి పోర్టల్​కు చికిత్స చేసినా.. సమర్ధనీయమైన భూ పరిపాలన సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు, రిటైర్డ్​ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story