- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో బియ్యం సరఫరాకు శ్రమిస్తున్నాం
-తెలంగాణ ప్రాంతీయ ఎఫ్‌సీఐ
దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో కరోనా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ తెలంగాణ ఎఫ్ సీఐ దేశంలోని ఇతర ప్రాంతాలకు నిరంతరాయంగా బియ్యం సరఫరా చేస్తోంది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్‌ల నుంచి 54వేల600టన్నుల బాయిల్డ్ రైస్, 13వేల టన్నుల రా రైస్ ను కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేశామని తెలంగాణ ఎఫ్ సీఐ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని అన్ని ఎఫ్ సీఐ గోడౌన్ లలో కలిపి ప్రస్తుతం 20 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉందని వెల్లడించింది. ఇవి కాక రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోడౌన్లలో కేంద్ర కోటా కింద మరో 8.5లక్షల టన్నుల బియ్యం ఉందని తెలిపింది. ఈ బియ్యాన్నంతటినీ కేంద్ర ఆదేశాల మేరకు పీడీఎస్ కింద పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం తెలంగాణ ఎఫ్ సీఐ స్టాఫ్, లేబర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని, కరోనా సోకకుండా సానిటైజర్లు, మాస్కులు వాడుతున్నారని వెల్లడించింది.