కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

by Shyam |
కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జల వనరుల శాఖ బోర్డు పరిధి నిర్ధారణకు వ్యతిరేకమని ఈఎన్సీ మురళీధర్ రావు స్పష్టం చేశారు. దీనిపై బుధవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. విభజన చట్టంలోని సెక్షన్‌-87 ప్రకారం కేంద్రం బోర్డు పరిధి నిర్ధారణకు ముందుకు పోరాదని, దీనికి వ్యతిరేకమన్నారు. బోర్డు పరిధి నిర్ధారణపై కేంద్రం ముందుకుపోతే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని లేఖలో స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్‌-1956లోని సెక్షన్‌-3 ప్రకారం తెలంగాణ వాటాను తేల్చాలంటూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఆరేండ్లుగా పెండింగులో ఉందని, ఇవన్నీ తేలినప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా పెరుగుతుందన్నారు. అప్పటివరకు బోర్డు పరిధిని నిర్ధారించవద్దని, ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ఒప్పందాన్ని రాష్ట్రం నుంచి అంగీకరించాల్సిన అవసరంలేదని, 75, 65 శాతం డిపెండబులిటీలపై రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక జలాల పంపిణీని సగం మేర (50:50 దామాషా) కొనసాగించాలని లేఖలో సూచించారు. అప్పటి వరకు కేంద్రం బోర్డు పరిధి నిర్ధారణపై ముందుకుపోవద్దని, అలా పోయినట్లుతే అది చట్టానికి విరుద్దమని ఈఎన్సీ మురళీధర్ రావు కేఆర్ఎంబీకి రాసిన లేఖలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed