- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష మందికి చికిత్స అందించే సామర్థ్యం ఉంది: సీఎస్
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కొవిడ్ -19కు సంబంధించి ప్రజారోగ్య స్పందనపై అన్నిరాష్ట్రాల సీఎస్‌లు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాల ప్రకారమే కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఒకేసారి లక్ష మందికి కరోనా చికిత్స అందించే సామర్థ్యంతో ఉన్నామని, అవసరమైన స్థాయిలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, టెస్టింగ్ కిట్లు, బెడ్లు, వెంటిలేటర్లు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, సీసీఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ పాల్గొన్నారు.