అంత దమ్ము టీఆర్ఎస్‌కు లేదు: బండి సంజయ్

by Shyam |
అంత దమ్ము టీఆర్ఎస్‌కు లేదు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్‌ఎస్ సర్కార్‌, కేసీఆర్‌ పై మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. కేసీఆర్ కుటుంబ చరిత్ర కోసమే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను కట్టడి చేసే దమ్ము టీఆర్ఎస్ సర్కార్‌కు లేదన్నారు. మంచి జరిగితే కేసీఆర్ ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం పైన నెడుతున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయలేదని బండి సంజయ్ అన్నారు.

Advertisement

Next Story