- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలకు శుభవార్త.. హుజురాబాద్‌లో తీన్మార్ మల్లన్న టీం సపోర్ట్
దిశ, జమ్మికుంట: హుజురాబాద్‌లో ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నికలో.. ధర్మం వైపు నిలబడిన ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నామని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కో కన్వీనర్ మాదం రజిని కుమార్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న టీంను నిర్వీర్యం చేయాలని టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. తీన్మార్ మల్లన్న టీంతో సంబంధం లేని కొంత మంది వ్యక్తులను టీఆర్ఎస్‌లో చేర్చుకొని నవ్వుల పాలయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామంలో ఉన్న మల్లన్న టీం మెంబర్లు టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మల్లన్న టీం సభ్యులు రెండు రోజుల్లో హుజురాబాద్‌కు చేరుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న కూడా అతి త్వరలో జైలు నుంచి విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పొలిమేర నుంచి తరిమివేసేంత వరకు మా శ్రేణులు పోరాడుతాయని చెప్పుకొచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా, హుజురాబాద్ మండల కన్వీనర్ బండ రమేష్, జమ్మికుంట కన్వీనర్ వెంకటేష్, కమలాపూర్ కన్వీనర్ సాగర్, వీణవంక కన్వీనర్ దాట్ల శ్రీనివాస్‌తో పాటు అన్ని మండలాల కో కన్వీనర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.