దొంగబాబా చెబితే తీన్మార్ మల్లన్న అరెస్ట్.. ఫైర్ అవుతోన్న అభిమానులు

by  |
దొంగబాబా చెబితే తీన్మార్ మల్లన్న అరెస్ట్.. ఫైర్ అవుతోన్న అభిమానులు
X

దిశ, ములుగు: దొంగబాబా ఫిర్యాదు చేస్తే ప్రశ్నించే గొంతుక అయిన తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం ఏంటని మల్లన్న టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ములుగు జిల్లా మల్లన్న టీమ్ కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక, నియంత, నయవంచన, దోపిడీ పాలన నడుస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందునే.. మల్లన్నను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రజానీకం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కేసీఆర్ ప్రభుత్వానికి ‌తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రంగురాళ్లు అమ్ముకునే దొంగ బాబా ఫిర్యాదు చేయడంతో మల్లన్నను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

Next Story