బెస్ట్ బ్యాటరీతో ‘టెక్నో స్పార్క్ పవర్ 2’

by  |
బెస్ట్ బ్యాటరీతో ‘టెక్నో స్పార్క్ పవర్ 2’
X

దిశ, వెబ్‌డెస్క్ : అతి తక్కువ ధరల్లో.. మంచి ఫీచర్లతో మొబైల్ ఫోన్లు అందిస్తున్న సంస్థ టెక్నో మొబైల్ ఇండియా. ఇది వరకే ‘టెక్నో స్పార్క్ పవర్’ మొబైల్‌తో పాటు టెక్నో స్కార్ప్ 5 ఫోన్లతో ఆకట్టుకుంది. కాగా ఈ రోజు( జూన్ 17) ‘టెక్నో.. స్పార్క్ ప‌వ‌ర్ 2’ పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఐస్ జేడియ‌ట్‌, మిస్టీ గ్రే క‌ల‌ర్లలో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో బిగ్గెస్ట్ స్క్రీన్, బెస్ట్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా, ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో జూన్ 23వ తేదీ నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.

ఫీచర్స్ :

డిస్ ప్లే : 7 ఇంచులు
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22
ర్యామ్ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్‌ : 64జీబీ
ఓ ఎస్ : ఆండ్రాయిడ్ 10
రేర్ కెమెరా : 16 +5+2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్స‌ల్
బ్యాట‌రీ : 6000 ఎంఏహెచ్
ధర : రూ. 9,999/-


Next Story

Most Viewed