- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YouTube Shorts : క్రియేటర్లకు కొత్త అప్‌డేట్ తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై షార్ట్స్?
దిశ, డైనమిక్ బ్యూరో: యూట్యూబ్ షార్ట్స్ కంటెంట్ క్రియేటర్లకు ఆ సంస్థ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ షార్ట్స్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో పోటీ పడుతూ ఈ యూట్యూబ్ షార్ట్స్ ప్లాట్‌ఫామ్ వచ్చిన కొద్దికాలంలోనే విశేశ ఆదరణ పొందింది. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా అప్‌లోడ్ చేసే షార్ట్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ కోట్లలో వ్యూస్ సంపాదిస్తున్నాయి. మరోవైపు షార్ట్స్ క్రియేటర్స్‌కు చక్కని ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. అయితే ‘షార్ట్స్’లో స్వల్ప మార్పులు చేస్తూ కంటెంట్ క్రియేటర్ల కోసం తాజాగా యూట్యూబ్ కొత్త అప్‌డేట్ తీసుకరాబోతుంది.
అక్టోబర్ 15 నుంచి వీడియో క్రియేటర్స్ తమ షార్ట్ వీడియోల నిడివిని మూడు నిమిషాల వరకు పెంచుకునే వీలుని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్ 60 సెకన్లలోపు మాత్రమే షార్ట్స్‌ను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల కొన్ని అంశాలను కుదించి చూపించాల్సి వస్తుంది. దీంతో పూర్తి సమాచారం అందించడం చాలా వరకు కష్టమవుతోంది. ఈ నేన తాజాగా వచ్చే ఈ కొత్త అప్‌డేట్‌తో, క్రియేటర్స్ తమ వీడియోలను మరింత క్రియేటివ్‌గా తయారుచేసుకోవచ్చు. కాగా, యూట్యూబ్ షార్ట్స్ ఇన్‌స్టా రీల్స్‌కు పోటీగా 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటగా 15 నుంచి 30 సెకన్ల వరకే షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ నిడివిని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.