ఇంటర్‌నెట్ లేకుండా ఆఫ్‌లైన్‌లో 'Google Translater'

by Harish |
ఇంటర్‌నెట్ లేకుండా ఆఫ్‌లైన్‌లో Google Translater
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ వినియోగదారులకు చాలా రకాల సేవలు అందిస్తుంది. ముఖ్యంగా గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా యూజర్లకు భాష గురించిన సమస్యలను చాలా వరకు పరిష్కరించింది. దీని ద్వారా ఒక భాషలో ఉన్న కంటెంట్‌ను మరో భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.

Google ట్రాన్స్‌లేటర్‌ను మొదటిసారిగా 2006 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి మొదలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అర బిలియన్ మందికి పైగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ ఈ సేవలను వెబ్‌బ్రౌజర్‌లో మాత్రమే కాకుండా యాప్ ద్వారా కూడా అందిస్తుంది. అయితే ఈ ట్రాన్స్‌లేటర్ ఇంటర్‌నెట్ ఉంటేనే పనిచేస్తుంది. దీంతో యూజర్లకు నెట్ లేని సమయంలో, అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ లేని ఏరియాలో ఇది పనిచేయదు.

దీంతో అలాంటి ఏరియాలలో కూడా గూగుల్ ట్రాన్స్‌లేటర్ వాడుకునేలా 33 కొత్త భాషలను ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌లేట్‌ చేసుకొనేలా అప్‌డేట్‌ అందించింది. ఈ భాషలను ఆఫ్‌లైన్‌లో వాడుకునేందుకు ముందుగా యూజర్లు ఆయా భాషల ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

దీని కోసం యూజర్లు Google Translate యాప్‌ని Google Play Store (Android) లేదా App Store (iOS) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేటర్ ఎంచుకుని మీకు కావాల్సిన భాషకు సంబంధించిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే Google ట్రాన్స్‌లేటర్ ఉపయోగించవచ్చు.

ఎక్కడికైనా భాష తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముందుగా అక్కడి భాషకు సంబంధించిన ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నెట్ లేకుండానే అక్కడ భాష సమస్యల నుంచి బయటపడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed