- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WhatsApp New Feature: మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant Messaging App) వాట్సాప్(WhatsApp) తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ఇటీవలే పలు సదుపాయాల్ని తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా ఫోటోలను సెర్చ్ చేసేందుకు మరో కొత్త ఫీచర్(New Feature)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సెర్చ్ ఆన్ వెబ్(Search On Web)’ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు ఇతర బ్రౌజర్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ లోనే ఇమేజెస్(Images)ను సెర్చ్ చేయవచ్చు. వాట్సాప్ చాట్ లో ఫోటో ఓపెన్ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్ అనే మెనూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే Search On Web ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఆ ఫొటోకు సంబంధించిన సోర్స్, ఫోటోను ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే సమాచారం సులభంగా తెలిసిపోతుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ వెల్లడించింది.