WhatsApp నుంచి అదిరే ఫీచర్: ఫోన్ ఆఫ్‌లో ఉన్న కూడా వాట్సాప్ చాట్‌లు వర్కింగ్

by Harish |   ( Updated:2023-03-24 12:08:19.0  )
WhatsApp నుంచి అదిరే ఫీచర్: ఫోన్ ఆఫ్‌లో ఉన్న కూడా వాట్సాప్ చాట్‌లు వర్కింగ్
X

దిశ, వెబ్‌డెస్క్:వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్ వచ్చింది. నాలుగు డివైజ్‌లకు వాట్సాప్‌ను లింక్ చేయడమే కాకుండా, ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా చాట్‌లు మాములుగా పనిచేసే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ‘ఎలాంటి చార్జింగ్ సమస్య లేకుండా ఇకమీదట వాట్సాప్‌ను నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఫోన్ ఆఫ్ చేసి ఉన్న కూడా కనెక్టెడ్ డివైజ్‌లో చాట్‌లు మాములుగా వాడుకోవచ్చని’ కంపెనీ ట్విట్టర్‌లో పేర్కొంది. అలాగే, ఫోన్ ఆఫ్‌లో ఉన్న కూడా మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని వాట్సాప్ తెలిపింది.

దీంతో పాటు ఇతర డివైజ్‌లకు వాట్సాప్‌ను త్వరగా కనెక్ట్ చేయడానికి Windows వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను తెచ్చినట్టు మెటా యాజామాన్యం తెలిపింది. దీని ద్వారా వేగవంతమైన లోడింగ్, ఫాస్ట్ ఇంటర్‌ఫేస్‌తో, ఫాస్ట్ చాటింగ్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది.

Read more:

మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన WhatsApp

Advertisement

Next Story

Most Viewed