ఇక స్మార్ట్‌వాచ్‌లో వాట్సాప్ మెసేజ్‌లు!

by Harish |
ఇక స్మార్ట్‌వాచ్‌లో వాట్సాప్ మెసేజ్‌లు!
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా అదరిపోయే ఫీచర్‌ను తీసుకురానుంది. కొత్తగా వచ్చే ఫీచర్‌లో యూజర్లు తమ స్మార్ట్‌వాచ్‌లను నేరుగా వాట్సాప్ ఖాతాకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో వాట్సాప్ మెసేజ్‌లు, చాట్‌లను స్మార్ట్‌వాచ్‌లో చూడవచ్చు. వాట్సాప్ బీటా 2.23.10.10 పేరుతో కొత్త వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది Wear OS కి సపోర్ట్ చేస్తుంది. ఈ అప్‌డేట్‌ను Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను స్మార్ట్‌వాచ్ యాప్‌కు లింక్ చేసుకోడానికి వాచ్‌లోని 8-అంకెల కోడ్‌ను ఫోన్‌లో ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేశాక, స్మార్ట్‌వాచ్‌‌కు వాట్సాప్‌ సింక్ అయి, వాట్సాప్ ఖాతాకు వచ్చే మెసేజ్‌లు, చాట్‌లు అన్ని వాచ్‌లోనే చూడవచ్చు. ఈ విధానంలో చాట్‌లు ఎండ్-టూ-ఎండ్ సురక్షితంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story