మహిళ రిపోర్టర్‌‌ను లైంగికంగా వేధించిన మగ రోబో ? సౌదీలో ఫస్ట్ మేల్ రోబో ‘ముహమ్మద్’

by Ramesh N |   ( Updated:2024-03-09 14:10:23.0  )
మహిళ రిపోర్టర్‌‌ను లైంగికంగా వేధించిన మగ రోబో ? సౌదీలో ఫస్ట్ మేల్ రోబో ‘ముహమ్మద్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సౌదీ అరేబియాకు చెందిన మొదటి మగ రోబో మహిళా రిపోర్టర్‌ను లైంగికంగా వేధించనట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని రియాద్‌లో మార్చి 4వ తేదీన డీప్‌ఫెస్ట్ లైవ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌదీ మొట్టమొదటి మగ రోబోట్ పేరు ‘ముహమ్మద్’ ప్రదర్శనకు ఉంచారు. ఓ మహిళ రిపోర్టర్ రోబో వద్ద వచ్చి రిపోర్ట్ చేస్తున్న సమయంలో.. రోబో మహిళ రిపోర్టర్‌ను తన చేయితో అసభ్యంగా తాకుతుంది. వెంటనే మహిళ రిపోర్టర్ షాక్ అయ్యి.. వెనక్కి తిరిగి రోబో పై చేయి ఎత్తుతునట్లు వీడియోలో కనిపిస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. దీంతో రోబో తయారు చేసిన యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఆ రోబోకు మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం ముందు నేర్పించాలని "క్రీప్‌గా కోడ్ చేయబడింది" కామెంట్స్ చేస్తున్నారు. రోబో అసభ్యంగా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. "ఎగ్జిబిషన్ కోసం ఏఐకి ఎవరు శిక్షణ ఇచ్చారు? అని నెటిజన్లు ప్రశ్నించారు. మరికొంత మంది నెటిజన్లు రోబోట్‌ను సమర్థించారు. అది కావాలని చేయలేదని అంటున్నారు. ‘మెన్ విల్ బీ మెన్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రోబో ఉద్దేశపూర్వక చేయలేదని, తన ప్రోగ్రామింగ్ నిర్ణయం లేదా ‘గ్లిచ్’ కారణంగా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని ఏఐ నిపుణులు భావిస్తున్నారు. తెలిపారు.

Advertisement

Next Story