లాంచ్ ఆఫర్‌లో రూ.5,999 కే Tecno స్మార్ట్‌ఫోన్

by Harish |
లాంచ్ ఆఫర్‌లో రూ.5,999 కే Tecno స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: టెక్నో కంపెనీ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దాని పేరు ‘Tecno Pop 8’. ఇది బుధవారం మార్కెట్లోకి లాంచ్ అయింది. ఒకేఒక వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్‌లో లభిస్తుంది. ధర రూ. 6,499. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.5999 కే అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో జనవరి 9 నుంచి కొనుగోలుకు ఉంటుంది.

Tecno Pop 8 స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. Unisoc T606 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత HiOS 13తో రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 12-మెగాపిక్సెల్ AI-డ్యూయల్ రియర్ సెన్సార్ ఉంది. ముందు సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 400 శాతం ఎక్కువ సౌండ్ అవుట్‌పుట్‌ను అందించడానికి ఈ ఫోన్‌లో DTS సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. అలాగే, 10W వైర్డ్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని దీనిలో అమర్చారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.

Advertisement

Next Story