పవర్ బ్యాంక్‌లో ఈ లక్షణాలు కనిపించాయా.. వెంటనే పక్కన పెట్టేయండి..

by Sumithra |
పవర్ బ్యాంక్‌లో ఈ లక్షణాలు కనిపించాయా.. వెంటనే పక్కన పెట్టేయండి..
X

దిశ, ఫీచర్స్ : పవర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగిస్తున్న చాలా మందికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడంలో ఇది సహాయపడుతుంది. అయితే పవర్ బ్యాంక్ బాగున్నన్ని రోజులు బానే ఉంటుంది. కానీ అది కాస్త పాడైనా మయా డేంజర్ అని చాలా మందికి తెలియదు. పవర్ బ్యాంక్ చెడిపోవడానికి ముందు కొన్ని సిగ్నల్స్ ను గుర్తించాలి. వాస్తవానికి, పవర్ బ్యాంక్‌లో కొన్నిలక్షణాలు కనిపిస్తాయి, ఇవి పవర్ బ్యాంక్‌లో ఏదో లోపం ఉన్నట్లు సూచిస్తాయి.

లోపం ఉన్న పవర్ బ్యాంక్‌ని ఉపయోగించడం ప్రమాదకరం. ఇది ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పాడవుతున్న పవర్ బ్యాంక్ ని ఆపరేట్ చేస్తే పేలుడు సంభవించవచ్చు. మీ పవర్ బ్యాంక్‌లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే , దాన్ని ఉపయోగించకుండా పక్కన పెట్టేసేయండి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ బ్యాంక్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపయోగించవద్దు

1. ఉబ్బిన పవర్ బ్యాంక్ : మీ పవర్ బ్యాంక్ ఉబ్బితే వెంటనే దాన్ని ఉపయోగించడం మానేసి ఇంటి బయట పెట్టేయండి. ఈ పవర్ బ్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

2. ఓవర్ హీటింగ్ : పవర్ బ్యాంక్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అది వేడెక్కుతున్నట్లయితే, దాని వినియోగాన్ని నిలిపివేయాలి.

3. దుర్వాసన : పవర్ బ్యాంక్ నుంచి ప్లాస్టిక్ కాలిపోవడం లేదా కరిగిపోవడం వంటి వాసన వస్తే, అది పనిచేయక పోవడానికి సంకేతం. అలాంటి పరిస్థితిలో పవర్ బ్యాంకును ఉపయోగించ కూడదు. ఒక వేళ ఉపయోగిస్తే దాని కారణంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.

4. లీకేజీ/లీక్ : పవర్ బ్యాంక్ లీక్ అయితే చాలా ప్రమాదకరం. ఈ సమయంలో చార్జింగ్ పెడితే విద్యుత్ షాక్ సంభవించే ప్రమాదం ఉంటుంది.

5. తక్కువ చార్జింగ్ : పవర్ బ్యాంక్ మునుపటి కంటే తక్కువ ఛార్జింగ్ చేస్తుంటే, పవర్ బ్యాకప్ పనితీరు బాగా లేదని అర్థం. పోర్ట్ సరిగ్గా లేకపోవడం, కేబుల్ సరిగ్గా లేకపోవడం వంటి కారణంగా ఛార్జింగ్ సమస్యలు కూడా సంభవించవచ్చు.

Advertisement

Next Story