- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ కొత్త సిరీస్ ఫోన్లు విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధరల వివరాలివే..

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ లవర్స్‌కు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్(Samsung) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన శాంసంగ్ అన్‌ప్యాక్డ్-2025 ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్ S సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో గెలాక్సీ S25 సిరీస్‌ను(Samsung Galaxy S25 Series) లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇక ఈ కొత్త సిరీస్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అడ్వాన్స్‌డ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25(Samsung Galaxy S25)..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఫోన్లు 12gb+128gb, 12gb+256gb, 12gb+512gb వేరియెంట్లలో అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో S25 ఫోన్ల ప్రారంభ ధర రూ.80,999గా ఉంది. ఐస్‌బ్లూ, మింట్, సిల్వర్ షాడో రంగుల్లో లభించనున్నాయి. 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డైనమిక్ అమోలోడ్ డిస్‌ప్లే(HD Dynamic AMOLED), 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్క్రీన్ ఈ ఫోన్ల సొంతం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7, అడ్వాన్స్‌డ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 25 వాట్స్‌కి సపోర్ట్ చేసే 4000mAh బ్యాటరీ ఉంది. అలాగే 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇచ్చారు. 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫొటో కెమెరాలు అమర్చారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా(Samsung Galaxy S25 Ultra )..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్లు 12gb+256gb, 12gb+512gb, 12gb+ 1tbతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ల ధరలు ప్రారంభ ధర రూ.1,29,999గా ఉంది. టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్‌బ్లూ, వైట్ బ్లూ రంగుల్లో లభిస్తాయి. ఇందులో 6.9 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే(HD Dynamic AMOLED 2X) ఉండగా.. 2,600 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేటు ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అండ్రాయిడ్ 15OS ఆధారిత వన్ యూఐ 7తో ఇది పని చేస్తుంది. దీనికి కూడా 7 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించారు. బ్యాక్ కెమెరా 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలీ ఫొటో కెమెరా(5 ఎక్స్ ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 45Wకి సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ప్లస్(Samsung Galaxy S25 Plus)..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ప్లస్ ఫోన్లు 12gb+256gb, 12gb+512gb వేరియెంట్లలో అందుబాటులోకి రానున్నాయి. రూ.99,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. ఐస్‌బ్లూ, మింట్, సిల్వర్ షాడో రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉండగా.. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ల సొంతం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఎస్25 కెమెరాలనే ఎస్25+లోనూ అమర్చారు. అలాగే 45Wకి సపోర్ట్ చేసే 4900mAh బ్యాటరీ ఉంటుంది. ఇక ఈ ఫోన్లు యూఎస్ మార్కెట్లో ఫిబ్రవరి 7 నుంచి మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.