ఎండలో చల్లదనం కోసం మార్కెట్లోకి కొత్తగా సోనీ ‘Pocket AC’ లు

by Harish |
ఎండలో చల్లదనం కోసం మార్కెట్లోకి కొత్తగా సోనీ ‘Pocket AC’ లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. వేడి, ఉక్క పోత అధికంగానే ఉంటుంది. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళినప్పుడు చెమటలు విపరీతంగా వస్తాయి. దీని వలన చీకాకు గా అనిపిస్తుంది. అయితే బయట తిరుగుతున్నప్పుడు ఈ ఎండ, వేడి నుంచి తప్పించుకోడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎండ, వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొత్త రకం ప్రోడక్ట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అదే ‘రియాన్ పాకెట్ ఏసీ2’. దీని ద్వారా శరీరం అంత చల్లగా ఉంటుంది. ఎంత వేడిగా ఉన్న కూడా చల్లదనాన్ని ఇది మనకు అందిస్తుంది. దీన్ని సులభంగా క్యారీ చేయవచ్చు.


‘పాకెట్ ఏసీ’ పవర్ బ్యాంక్ సైజులో ఉంటుంది. జేబులో పట్టే విధంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనిని సోనీ కంపెనీ తయారు చేసింది. దీంట్లో రెండు బ్యాటరీలు అమర్చారు. కేవలం రెండు గంటలు చార్జింగ్ చేస్తే ఒక రోజంతా వాడుకోవచ్చు. ‘పాకెట్ ఏసీ’ కొనుగోలు సమయంలో స్మాల్, మీడియం, లార్జ్ సైజ్‌ల టీషర్ట్స్ కూడా ఇస్తారు. వీటిలో ఎంచక్కా అమర్చుకోవచ్చు. దీని ధర రూ. 10,300 గా కంపెనీ పేర్కొంది. ఎండాకాలంతో పాటు, టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ద్వారా చలి కాలంలో కూడా దీనిని వాడుకోవచ్చు.





Advertisement

Next Story