- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విండో AC శబ్దం చేస్తుందా.. ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలను పాటించండి..
దిశ, ఫీచర్స్ : విండో ఎయిర్ కండిషనర్ వినియోగదారులు తరచుగా అది ఎక్కువ శబ్దం చేస్తుందని ఫిర్యాదు చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ శబ్దం చాలా బిగ్గరగా మారుతుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం కష్టం అవుతుందని వాపోతారు. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
విండో ఎయిర్ కండీషనర్‌లో శబ్దం రావడానికి కారణం..
కంప్రెసర్ నాయిస్ : విండో AC కంప్రెసర్ ఎక్కువ శబ్దం చేస్తుంది. కంప్రెసర్ పాడయ్యేముందు నిర్వహణ లేకపోవడం వల్ల తరచుగా శబ్దం చేస్తుంది.
ఫ్యాన్ శబ్దం : విండో AC ఫ్యాన్లు కూడా తెగశబ్దం చేస్తాయి.
స్వింగ్ మోడ్‌లో సమస్య : కొన్నిసార్లు విండో ఎయిర్ కండీషనర్ స్వింగింగ్ మెకానిజంలో సమస్య ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఎయిర్ కండీషనర్ స్వింగ్ చేసేటప్పుడు శబ్దం చేస్తుంది.
విండో AC శబ్దాన్ని తగ్గించడానికి ట్రిక్..
వీలైతే మీ AC నడుస్తున్నప్పుడు తక్కువ శబ్దం వచ్చే చోట ఇన్‌స్టాల్ చేయండి. దీనితో పాటు విండో ఎయిర్ కండీషనర్ భాగాలను చెక్ చేస్తూ ఉండండి. అవసరమైతే వాటిని సకాలంలో రిపేర్ చేస్తూ ఉండండి. స్ప్లిట్ లేదా విండో ఏసీ అయినా, రెండింటికీ ఎప్పటికప్పుడు సర్వీస్ అవసరం. ఏసీ సర్వీస్ సంవత్సరానికి రెండుసార్లు చేయాలి.
5 నుండి 7 సంవత్సరాలలో ఎయిర్ కండీషనర్ మార్పు..
మీ విండో ఎయిర్ కండిషనర్ పాతదైతే ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటే. అలాగే పైన పేర్కొన్న చిట్కాలు పని చేయకపోతే, మీరు మీ ఎయిర్ కండీషనర్‌ను భర్తీ చేయాలి. ఏమైనప్పటికీ నిపుణులు ఎయిర్ కండీషనర్ ప్రతి 5 నుండి 7 సంవత్సరాలకు మార్చాలంటారు.