Realme 13 Pro: ఇండియా మార్కెట్లోకి AI ఫీచర్లతో Realme 13 Pro సిరీస్

by Harish |   ( Updated:2024-07-30 14:10:49.0  )
Realme 13 Pro: ఇండియా మార్కెట్లోకి AI ఫీచర్లతో Realme 13 Pro సిరీస్
X

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Realme ఇండియా మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ సిరీస్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme 13 Pro’. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 13 Pro, 13 Pro+. రెండు ఫోన్‌లు 5,200mAh బ్యాటరీ యూనిట్‌లను కలిగి ఉన్నాయి. కెమెరాలో ఏఐ స్మార్ట్‌ ఫీచర్లను కూడా అందించారు.

Realme 13 Pro మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. 8GB RAM + 256GB ధర రూ.28,999, 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 31,999. ఇది ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్, మోనెట్ గోల్డ్ షేడ్స్‌లో లభిస్తుంది.

Realme 13 Pro+ 8GB RAM + 256GB ధర రూ.32,999, 12GB RAM+ 256GB స్టోరేజ్ ధర రూ. 34,999. 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 36,999. ఇది ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా జులై 31న ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 6న మధ్యాహ్నం 12:00 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. కొనుగోలు సమయంలో తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.


Realme 13 Pro స్పెసిఫికేషన్స్

* 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లే.

* 120Hz వరకు రిఫ్రెష్ రేట్

* Android 14-ఆధారంగా రన్ అవుతుంది.

* Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది

* బ్యాక్ సైడ్ 50MP సోనీ కెమెరా+ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.

* 45W చార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని అందించారు.

* నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.


Realme 13 Pro+ స్పెసిఫికేషన్స్

* 6.7-అంగుళాల పూర్తి-HD+(1,080x2,412 పిక్సెల్‌లు)

* AMOLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌

* స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC ద్వారా పనిచేస్తుంది.

* Android 14-ఆధారంగా రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50MP+50MP సోనీ కెమెరాలు+ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా.

* ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది.

* 80W చార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీ ఉంది.

Advertisement

Next Story

Most Viewed