రాహుల్ గాంధీ, పవన్ కల్యాణ్, కోహ్లీ, చిరంజీవికి అనూహ్య షాక్

by GSrikanth |
రాహుల్ గాంధీ, పవన్ కల్యాణ్, కోహ్లీ, చిరంజీవికి అనూహ్య షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్విటర్ దాని యూజర్లకు షాకిచ్చింది. దేశంలోని పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో సహా పలు హైప్రొఫైల్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది. నిజమైన సెలబ్రిటీలను గుర్తించేందుకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌రూల్‌ను అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఫ్రీగా ఇచ్చిన ట్విట్టర్ బ్లూటిక్.. ఇక నుంచి డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ల బ్లూటిక్ మార్క్‌ను ట్విట్టర్ తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బ్లూటిక్స్ తొలగించబడ్డాయి. ఈ ప్రక్రియ గురువారం రాత్రి నుండి ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బ్లూటిక్ కోల్పోయిన వారు వీళ్లే...

భారతదేశంలో బ్లూటిక్ కోల్పోయిన యూజర్లలో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు, యూపీ సీఎం యోగి, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఉన్నారు. క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్లూటిక్ కూడా పోయింది. సినీ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆలియాభట్, చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, నాగచైతన్య, అక్కినేని అఖిల్, కుష్బూ సుందర్ ఉన్నారు. హైప్రొఫైల్ యూజర్లలో పాప్ గాయని బియాన్సే, పోప్ ఫ్రాన్సిస్, వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖుల ఖాతాలకు సైతం ట్విట్టర్ బ్లూటిక్ మార్క్ తొలిగిపోయింది. కానీ, కొందరు ప్రముఖులకు మాత్రం బ్లూటిక్ ఉండడం చర్చనీయాంశమైంది. దీంతో మా బ్లూటిక్ తొలిగిపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. మరి కొందరి ఖాతాలకు తానే వ్యక్తిగతంగా సబ్ స్క్రిప్షన్ చెల్లిస్తున్నట్లు సీఈఓ ఎలన్‌మస్క్ చెప్పుకొచ్చారు. కాగా, ఇది వరకే సబ్‌స్క్రైబ్ చేసుకోని వాళ్ల ఖాతాల బ్లూటిక్ తొలగిస్తామని హెచ్చరించిన ట్విటర్..ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed