OLA - Uber కొత్త రూల్.. క్యాబ్‌ను బుక్ చేసుకుంటే ఎవరికి లాభమో తెలుసా ?

by Sumithra |
OLA - Uber కొత్త రూల్.. క్యాబ్‌ను బుక్ చేసుకుంటే ఎవరికి లాభమో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : Ola - Uber సంస్థలు ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు మరో కొత్త రూల్ ను తీసుకువచ్చింది. దీంతో క్యాబ్‌ డ్రైవర్లకు కాస్త ఉపశమనం లభిస్తుందనే అనుకోవాలి. మరి OLA-Uber ప్రవేశపెట్టిన సరికొత్త రూల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

OLA - Uber డ్రైవర్లు ఇప్పుడు ఎలాంటి కట్టింగ్స్ లేకుండా పూర్తి చెల్లింపు పొందనున్నారు. అలాగే వారు కంపెనీకి ప్రతి రైడ్‌ పై కమీషన్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదట. ఇప్పటికే రాపిడో డ్రైవర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారు రోజుకు రూ. 9 నుండి రూ. 29 మాత్రమే చెల్లిస్తున్నారట. అంటే వారు ప్రతిఒక్క రైడ్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఈ సేవలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో OLA ప్రారంభించింది. సంస్థ కోసం పనిచేసే వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రైడ్‌లో కమీషన్ చెల్లించడం ద్వారా డ్రైవర్లు ఎక్కువ నష్టాలను చూసేవారు. అలాగే పన్ను కూడా చెల్లించాల్సి వచ్చేది. కానీ ఈ సేవల పుణ్యమాని నిర్ణీత మొత్తం చెల్లించడం ద్వారా డ్రైవర్ జేబులోకి ఎక్కువ డబ్బు వెళుతుంది.

OLA-Uber లో ఇప్పుడే ఈ సౌకర్యం ప్రారంభం అయ్యింది. అయితే నమ్మ యాత్రి వంటి యాప్‌లు ఇప్పటికే అలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం, నమ్మ ప్రయాణీకులు తమ సేవను రోజుకు రూ. 25 లేదా పది రైడ్‌ల వరకు రూ. 3.5/రైడ్‌కు అందిస్తున్నారు.

Advertisement

Next Story