NoiseFit నుంచి సరికొత్త 'హాలో' స్మార్ట్‌వాచ్‌ లాంచ్

by Harish |
NoiseFit నుంచి సరికొత్త హాలో స్మార్ట్‌వాచ్‌ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: NoiseFit కంపెనీ ఇండియాలో కొత్తగా 'హాలో' స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3,999. Amazon, NoiseFit వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది స్టేట్‌మెంట్ బ్లాక్, జెట్ బ్లాక్, క్లాసిక్ బ్లాక్, వింటేజ్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, ఫైరీ ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది. 'హాలో' స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో 466×466 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.


వాచ్‌లో 150కి పైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. హెల్త్ మానిటరింగ్ సిస్టం ద్వారా SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ ట్రాకర్ వంటి సెన్సార్‌లు ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68-రేట్ చేయబడింది. బ్యాటరీ చార్జింగ్ గరిష్టంగా 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.



Advertisement

Next Story