షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు

by Harish |   ( Updated:2022-10-20 12:32:06.0  )
షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు
X

దిశ, వెబ్‌డెస్క్: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 2023 నుండి పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలని చూస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఒకే అకౌంట్‌ను వివిధ వ్యక్తులకు షేరింగ్ చేయడం వలన తమ ఆదాయంపై ఎఫెక్ట్ పడుతుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో వినియోగదారులకు వచ్చే ఏడాది సబ్-ఖాతాలను యాడ్ చేసుకోవడానికి అనుమతించాలని చూస్తోంది.

ఇప్పటికే కొన్ని దేశాల్లోని యూజర్లు తమ పాస్‌వర్డ్/అకౌంట్‌ను ఇతరులకు షేర్ చేసినందుకు గానూ కొంత మనీ చెల్లించాల్సి ఉంటుంది. సబ్ ఖాతాలను ఇవ్వడం ద్వారా ఆదాయంతో పెరుగుదలతో పాటు, యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్ సులభంగా ఉంటుందని కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం.

ఇటీవల, నెట్‌ఫ్లిక్స్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 2.41 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందింది. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 223.09 మిలియన్లకు చేరుకుంది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినంగా ఉండటంతో ఈ ఏడాది ప్రారంభంలో సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య తగ్గంది. దీంతో పాస్‌వర్డ్/అకౌంట్‌ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed