Lenovo నుంచి కొత్త Tab.. ఒక్కచార్జింగ్‌తో 55 గంటలు..

by Harish |
Lenovo నుంచి కొత్త Tab.. ఒక్కచార్జింగ్‌తో 55 గంటలు..
X

దిశ, వెబ్‌డెస్క్: Lenovo కంపెనీ ఇండియాలో కొత్తగా టాబ్లెట్‌‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Tab M19 5G’. దీని బేస్‌ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.24,999. దీంతో పాటు ట్యాబ్ 6GB RAM, 128GB మెమరీతో కూడా అందుబాటులో ఉంటుంది, అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ ట్యాబ్ జులై15 నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, Lenovo అధికారిక వెబ్‌సైట్‌లో, స్టోర్లలో అమ్మకానికి ఉంటుంది. ఇది అబిస్ బ్లూ కలర్ షేడ్‌లో విడుదల అయింది.

Lenovo Tab M19 5G టాబ్లెట్‌‌ 10.61-అంగుళాల LCD (1200 x 2000) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ముందు 8-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. టాబ్లెట్ 7,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం, 55 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను అందిస్తుంది. దీనిలో డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.

Advertisement

Next Story

Most Viewed