హోటల్స్‌లో సీక్రెట్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసా?

by Jakkula Samataha |
హోటల్స్‌లో సీక్రెట్ కెమెరాను ఎలా గుర్తించాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సీక్రెట్ కెమెరా ద్వారా చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా హోటల్ రూమ్స్, షాపింగ్ మాల్స్, వేయిటింగ్ రూమ్స్‌లలో సీక్రెట్ కెమెరా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మనం అనేక సంఘటనల గురించి ఇప్పటికీ వినే ఉంటాం. సీక్రెట్ కెమెరా ద్వారా వీడియో తీశారు. గదిలో ఎవరో సీక్రెట్‌గా కెమెరా పెట్టారు అంటూ అనేక వార్తలొచ్చాయి. అయితే వీటి నుంచి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అయితే మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టారేమో అనే అనుమానం కలుగుతుంటుంది. నిజంగా మీరు ఉన్న రూమ్‌లో రహస్య కెమెరా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మీరు వాష్ రూమ్ లేదా, హోటల్ రూమ్‌కు వెళ్లి నప్పుడు మొదటగా ఆ పరిసరాలు పూర్తిగా గమనించాలి. గోడలపై ఉన్న గడియారం, తలపులపై చేసిన చిన్నటి రంధ్రాలను గమనించాలి. మీకు ఏమైనా చిన్నగా హోల్స్‌లా కనిపిస్తే వాటిని టేప్ సహాయంతో లేదా దేనితోనైనా కప్పివేయాలి. అలాగే అక్కడ ఉన్న వస్తువులు, ఏదైనా లైటింగ్‌కు సంబంధించిన పరికరాలు కనిపిస్తే దాన్ని లేజర్ లైట్ సహాయంతో చెక్ చేయాలి. బాత్రూంలో షవర్ వాటర్ ట్యాప్ వాష్ బేసిన్ టాయిలెట్ మొదలైన వాటిని చెక్ చేయాలి. గదిలో ఉంచిన లాప్టాప్ మైక్రోఫోన్ ని కూడా కవర్ చేయండి. లాప్టాప్ చాలా సార్లు హ్యాక్ చేయబడి దాని మైక్రోఫోన్ ద్వారా మిమ్మల్ని పరీక్షించవచ్చు. అంతే కాకుండా మీరు రూమ్కు వెళ్లాక స్పై కెమెరా డిటాక్టింగ్ ప్రాసెస్ చేయాలి. దీని ద్వారా సెర్చ్ మోడ్ పది నుంచి ఇరవై నిమిషాల్లో యాక్టివ్ అవుతుంది. దీని వలన ఈజీగా సీక్రెట్ కెమెరా తెలుసుకోవచ్చు. ఇలా మీరు సీక్రెట్ కెమెరా గురించి ఈజీగా తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story