- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jio Bharat: మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చిన జియో..ధర రూ.1099 మాత్రమే
దిశ, వెబ్‌డెస్క్: యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఫీచర్ ఫోన్లను తీసుకువస్తున్న రిలయన్స్ జియో(Reliance Jio) తాజాగా మరో రెండు కొత్త ఫీచర్ మొబైల్స్(New Feature Mobiles)ను లాంచ్ చేసింది. ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(IMC) 2023 సదస్సులో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో భారత్ వీ3, వీ4(Jio Bharat V3, V4) పేరుతో ఈ కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.1099 నుంచి స్టార్ట్ అవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్, జియో మార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
ఈ ఫోన్లను కొన్న వారికి రూ. 123 రీఛార్జి ఫ్రీగా ఇస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చుని జియో పేర్కొంది. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు 1000mAh బ్యాటరీతో పనిచేయనున్నాయి. మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.ఈ ఫోన్ల ద్వారా UPI పేమెంట్‌లు చేయవచ్చు. లైవ్ TV ని కూడా వీక్షించవచ్చు.ఈ ఫోన్‌లు 23 భాషలను సపోర్టు చేయనున్నాయి. కాగా గతేడాది జియో వీ2 పేరుతో ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఇదే సిరీస్ లో మరో రెండు ఫీచర్ మొబైల్స్(Feature Mobiles)ను తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.