- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jio Bharat 4G: కస్టమర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్.. రూ. 699కే 4జీ ఫోన్..!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన దీపావళి పండగ సీజన్(Diwali Festival Season) నడుస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపేనీలు ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియో(Reliance Jio) దీపావళి ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జియో భారత్ 4G(Jio Bharat 4G) ఫోన్లపై భారీ డిస్కౌంట్(Huge Discount)లను ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫోన్ల ధరలు రూ. 999 ఉండగా ఈ ఆఫర్ లో భాగంగా రూ. 699కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
జియో సిమ్ కార్డు(Jio SIM card)తో మాత్రమే వర్క్ చేసే ఈ ఫోన్లను జియో మార్ట్, రిలయన్స్ స్టోర్, అమెజాన్ వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఇతర నెట్ వర్క్ రీఛార్జిలతో పోలిస్తే ఈ మొబైల్ లో ప్లాన్లు తక్కువ రేట్ కు లభిస్తాయని తెలిపింది. కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు.14 జీబీ డేటాతో పాటు 455 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు మీరు లైవ్ చూడొచ్చు. ఇవే కాకుండా సినిమా ప్రీమియర్లు, తాజా సినిమాలు కూడా మీరు జియో భారత్ ఫోన్ ఉపయోగించి చూడొచ్చు. కాగా జియో భారత్ ఫోన్లను ఇండియా(India)లో సుమారు 25 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా జియో ఫోన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు(Digital Payments) చేయవచ్చు. అలాగే యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.