ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ టైం 10 నిమిషాల వరకు పెంపు!

by Harish |   ( Updated:2023-09-01 05:47:22.0  )
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ టైం 10 నిమిషాల వరకు పెంపు!
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాట్‌ఫామ్‌లో కొత్తగా రీల్స్ టైం పరిమితిని పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు త్వరలో 10 నిమిషాల నిడివిని అందించడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి అలెశాండ్రో పలుజ్జీ ట్విట్టర్‌లో రెండు స్క్రీన్ షాట్‌లను షేర్ చేశారు. అందులో ఒకటి మూడు నిమిషాలు రికార్డ్ చేయడానికి, మరొకటి 10 నిమిషాల పాటు రికార్డ్ చేయడానికి ఉన్నట్టు ఉంది. అయితే ఫీచర్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రీల్స్ టైంను 10 నిమిషాలకు పెంచడం ద్వారా YouTube వీడియోలకు పోటీ ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం, షార్ట్-వీడియో ఫార్మాట్ రీల్స్ 90 సెకన్ల వరకు వ్యవధిని కలిగి ఉన్నాయి. TikTok మాత్రమే ఇప్పటివరకు 10 నిమిషాల టైం గల వీడియో కంటెంట్‌ను అందిస్తుంది, అయితే దీనికి అదనంగా 20 నిమిషాల వరకు కూడా రీల్స్ చేసే సదుపాయాన్ని TikTok అందిస్తుంది.

Advertisement

Next Story