Amazon Prime Day Sale 2024: సౌండ్‌బార్‌లు, స్పీకర్లపై భారీ తగ్గింపులు

by Harish |
Amazon Prime Day Sale 2024: సౌండ్‌బార్‌లు, స్పీకర్లపై భారీ తగ్గింపులు
X

దిశ, టెక్నాలజీ: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ సందర్బంగా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లతో పాటు కొనుగోలు సమయంలో బ్యాంక్ కూపన్‌లు, ఇతర ఆఫర్‌లను పొందవచ్చు. ముఖ్యంగా సౌండ్‌బార్‌లు, స్పీకర్లు, హోమ్ థియేటర్‌లను సాధారణ రోజుల్లో కంటే తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. సాధారణ కంపెనీల నుంచి మొదులుకుని టాప్ బ్రాండ్‌లకు చెందిన, మంచి సౌండ్ అనుభవాన్ని అందించే ఆడియో ఉత్పత్తులు అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

సోనీ కంపెనీ HT-S20R రియల్ 5.1ch డాల్బీ డిజిటల్ సౌండ్‌బార్ 400W అసలు ధర రూ.19,990 కాగా ఇప్పుడు ఈ సేల్‌లో రూ.17,400 కే లభిస్తుంది. అలాగే కొనుగోలు సమయంలో బ్యాంక్ డిస్కౌంట్‌ల ద్వారా ధర మరింత తగ్గుతుంది. Samsung (HW-C45E/XL) 300W పవర్‌తో 2.1 చానల్ సెటప్‌ను కలిగిన సౌండ్‌బార్‌ను 9,990 కే కొనుగోలు చేయవచ్చు. సాధారణ రోజుల్లో అసలు ధర రూ.27,900 వరకు ఉంటుంది. ప్రస్తుత సేల్‌లో 64 శాతం తగ్గింపుతో లభిస్తుంది.

BoAt Avante Bar 610 బ్లూటూత్ సౌండ్‌బార్ 25W RMS సిగ్నేచర్ సౌండ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.5,990 కాగా, ఇప్పుడు ఇది 70 శాతం తగ్గింపుతో రూ.1,798 కే కొనుగోలుకు అందుబాటులో ఉంది. JBL Go 3, వైర్‌లెస్ అల్ట్రా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను 2,499 కే సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా అసలు ధర రూ.3,999 వరకు ఉంది.



Next Story