20 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను రాసే Google AI ‘బార్డ్’

by Harish |
20 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను రాసే Google AI ‘బార్డ్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలోని గూగుల్ తన AI చాట్‌బాట్‌ ‘బార్డ్’ను అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను రాయడంలో వినియోగదారులకు సహాయం చేయడమే కాకుండా, జావా, సి++, పైథాన్‌తో సహా 20 ప్రోగ్రామింగ్ భాషలలో కోడ్ చేయడంతో పాటు, డీబగ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

గతంలో మైక్రోసాఫ్ట్ సపోర్ట్‌గల స్టార్టప్ OpenAI నుండి చాట్‌బాట్ అయిన ChatGPT విడుదల అయిన విషయం తెలిసిందే. దీంతో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. దీనికి పోటిగా గూగుల్ ‘బార్డ్’ను తెచ్చింది. ఇది వేగంగా కంటెంట్‌‌ను సృష్టిస్తుందని అలాగే, మరిన్ని కొత్త అప్‌డేట్‌లను బార్డ్‌కు యాడ్ చేయనున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై పోటీ వేగంగా పెరుగుతన్న కారణంగా గూగుల్ బార్డ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, గత ఏడాది మార్చి నుంచి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను కూడా కోరుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా దీనిలో మార్పులు చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది.

Advertisement

Next Story