- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్.. అక్షరాల రూ.75 కోట్లు! ప్రత్యేకత ఇదే!!
దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్ ఫోన్‌లలో బ్రాండ్ ఫోన్ ఏదంటే ఐఫోన్ అని ఖచ్చితంగా చెబుతారు. ఈ ఫోన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగానే ఈ ఫోన్ ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతాయి. అలాంటి ఐ ఫోన్‌లో వజ్రాలు పొదిగితే ఎంత ఖరీదు ఉంటుందో కదా.. అలాగే అంతే క్రేజీగా కూడా ఉంటుంది. అబ్బా ఆ ఫోన్‌ను తలచుకుంటేనే ఎంత గమ్మత్తుగా ఉందో కదా.
అప్పుడు ఆ ఫోన్‌తో కాల్స్ మాట్లాడడం పక్కన పెడితే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది యాపిల్ సంస్థ. 24 క్యారెట్ గోల్డెన్ కోటింగ్‌తో ఓ ఐ ఫోన్ తయారు చేసి ఆ ఫోన్ పై 500 వజ్రాలను పొదిగారు. 8.6 క్యారెట్ వజ్రంతో మెయిన్ నేవిగేషన్‌ను మలిచారు. 53 వజ్రాలను ఫోన్‌పై అందరికీ కనిపించే లోగోలో పొదిగారు. ఎంతో ఖరీదైన ఈ ఫోన్‌ను జాగ్రత్తగా భద్రపరిచేందుకు డైనోసర్ ఎముకతో ఓ బాక్స్‌ను కూడా తయారు చేశారు. 75 కోట్ల రూపాయల ఖరీదైన ఈ ఫోన్ ను 4S ఎలైట్ పేరుతో లాంఛ్ చేశారు.