2023లో ఎక్కువ మంది డిలీట్ చేసిన యాప్ ఏదో తెలుసా..

by Sumithra |   ( Updated:2023-12-31 11:42:39.0  )
2023లో ఎక్కువ మంది డిలీట్ చేసిన యాప్ ఏదో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్ : మరి కొద్ది గంటల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2024 లోకి అడుగుపెట్టబోతున్నాం.. పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు ఇప్పటికే ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. అయితే 2023 సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంది. ఇదిలా ఉంటే 2023లో మొబైల్ యూజర్స్ ఏ యాప్ లను ఎక్కువగా వాడారు, ఏయే యాప్ లను ఎక్కువగా తొలగించారు అన్న నివేదికలను కొన్ని సంస్థలు వెల్లడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికా టెక్ సంస్థ టీఆర్టీ డేటా సెంటర్ కొన్ని నివేదికలు వెల్లడించింది. 2023లో యూజర్లు ఎక్కువగా డిలీట్ చేసిన యాప్ మెటాకు చెందిన త్రెడ్ యాప్ అని అమెరికా టెక్ సంస్థ టీఆర్టీ డేటా సెంటర్ తెలిపింది. త్రెడ్ యాప్ లో అద్భుతమైన వీడియోలు, ఫోటోలు, రీల్స్ తీసుకునేందుకు అనువుగా ఉంది. ఈ యాప్ ను వచ్చిన ఒక్క రోజులోనే 100 మిలియన్లకు పైనే యూజర్లు డౌన్లోడ్ చేసుకునప్పటికీ ఐదు రోజుల్లోనే 80 శాతం మంది యూజర్లను పోగొట్టుకుంది.

అలాగే ఇన్స్టాగ్రామ్ యాప్‌ను పది లక్షలకు పైగా యూజర్లు డిలీట్ చేశారు. స్నాప్ చాట్ ను లక్షకు పైగా యూజర్లు డిలీట్ చేశారు. ఫేస్ బుక్ ను 49 వేల మంది వరకు డిలీట్ చేశారు. ఇక వాట్సాప్ ను 4,950 మంది మాత్రమే డిలీట్ చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 4.8 బిలియన్లు (480 కోట్లు) సోషల్ మీడియా యూజర్ల సంఖ్య దాటిపోయింది. యూజర్లు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాలను సోషల్ మీడియాను వాడేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed