కరెంట్ లేనప్పుడు సెల్ ఫోన్‌కు ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలో తెలుసా?

by Jakkula Samataha |
కరెంట్ లేనప్పుడు సెల్ ఫోన్‌కు ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మొబైల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తినే ఉండటం లేదు. స్టూడెంట్స్ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. అయితే కొన్ని సార్లు మనం ఫోన్‌లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు, లేదా మనకు నచ్చిన మూవీ చూస్తున్నప్పుడు చార్జింగ్ అయిపోతుంది. ఇంట్లో చూస్తే పవర్ ఉండదు. దీంతో మొబైల్‌లో చార్జింగ్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంత మంది తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతుంది. దీంతో వారు ఛార్జింగ్ కోసం సమస్యలు ఎదుర్కొంటారు. ఫోన్‌లో చార్జింగ్ లేకపోవడంతో కొంత మంది అసలు కరెంట్ లేకున్నా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. కరెంట్ లేకున్నా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కరెంట్ లేకున్నా సెల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక బాల్ పాయింట్ పెన్ లేదా తాళం చెవి, ఫోన్ చార్జింగ్ చేయడానికి కేబుల్, కార్ సిగరెట్ లైటర్‌తో ఉండే యూఎస్‌బీ అడాప్టర్, తొమ్మిది ఓల్టుల బ్యాటరీ, లోహపు క్లిప్ అవసరం అంట. వీటిని ఉపయోగించి మనం ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

అది ఎలాగంటే? ప్రతి బ్యాటరీకి రెండు టెర్మినల్స్, ధన, బుణావేశ గుర్తులు ఉంటాయి. అయితే వీటి నుంచి కరెంట్ పుట్టించడానికి ఓ లోహపు వస్తువును బుణావేశ ఎలక్ట్రాన్‌కు చుట్టాలి.లోహపు క్లిప్‌ను ఒక భాగం పైకి, మరో భాగం కిందిగి ఉండే విధంగా చుట్టుకోవాలి. తర్వాత,ధనావేశ ఎలక్ట్రాన్‌కు వద్ద కార్ అడాప్టర్‌ను ఉంచాలి. తర్వాత అడాప్టర్ మీద లోహపు భాగం తాకేలా చేయాలి. దీని వలన విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మన మొబైల్ ఫోన్‌ను యూఎస్‌బీ సాకెట్‌లో ప్లగ్ చేయాలి. ఇలా మన ఫోన్‌కు కరెంట్ లేకపోయినా ఈజీగా ఛార్చింగ్ పెట్టుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed