ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కారణంగా చైనా మార్కెట్‌లో తగ్గిన ఐఫోన్ విక్రయాలు

by Harish |   ( Updated:2024-02-02 08:43:12.0  )
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కారణంగా చైనా మార్కెట్‌లో తగ్గిన ఐఫోన్ విక్రయాలు
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ యాపిల్ ఐఫోన్ అమ్మకాలు చైనాలో మినహా ఇతర ప్రాంతాల్లో పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మూడు నెలల కాలానికి యాపిల్ ఆదాయం 2.1 శాతం పెరిగి $119.6 బిలియన్లకు చేరుకుంది. ఇది, విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువ. ఐఫోన్‌ల విక్రయాలు ఈ త్రైమాసికంలో 6 శాతం పెరిగి $69.70 బిలియన్లకు చేరాయి. అదే డిసెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనాలో అమ్మకాలు 13 శాతం తగ్గి 20.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది విశ్లేషకులు అంచనా వేసిన $23.5 బిలియన్ల కంటే చాలా తక్కువగా ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత గురువారం యాపిల్ షేర్లు 3 శాతం పడిపోయాయి..

సాధారణంగా యాపిల్ ఫోన్లకు చైనా అతిపెద్ద మార్కెట్ కంపెనీకి వచ్చే లాభాల్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే వస్తుంది. అయితే ఇటీవల చైనా మార్కెట్లో Huawei అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో యాపిల్ అమ్మకాలు తగ్గిపోయాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో Huawei అమ్మకాలు 71.1 శాతం పెరిగాయి.

కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ, సమీక్ష కాలంలో కంపెనీ దక్షిణ కొరియాలో అమ్మకాలలో కొత్త ఆల్-టైమ్ రికార్డ్‌ను అలాగే ఇండియా, ఇండోనేషియాలో డిసెంబర్-త్రైమాసికంలో కొత్త రికార్డులను నెలకొల్పిందని అన్నారు. కరోనా సమయంలో అమ్మకాలు తగ్గగా, తిరిగి డిమాండ్‌ను పుంజుకోడానికి వేగంగా ఫోన్లను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

డిసెంబరు 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో, యాపిల్ $119.58 బిలియన్ల అమ్మకాలను జరిపింది. ఇది, విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువ. చైనాకు వెలుపల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఐఫోన్‌లో మేము ముఖ్యంగా బలమైన రెండంకెల వృద్ధిని కలిగి ఉన్నామని కంపెనీ అధినేత టీమ్ కుక్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed