మహిళ తరుపున ఎయిర్‌లైన్స్‌కు ఈ మెయిల్ రాసిన ChatGPT.. వైరల్ అవుతున్న వీడియో

by Harish |   ( Updated:2023-08-11 05:39:33.0  )
మహిళ తరుపున ఎయిర్‌లైన్స్‌కు ఈ మెయిల్ రాసిన ChatGPT.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఆధారిత ChatGPT గురించే చర్చ నడుస్తోంది. ఏది అడిగిన కూడా అత్యంత కచ్చితత్వంతో సమాధానం ఇచ్చేటటువంటి ChatGPT యాప్ ప్రారంభమైన తొందర్లోనే చాలా మంది వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దిగ్గజ సంస్థలు అయినటువంటి గూగుల్, ఫేస్‌బుక్ తదితర కంపెనీలకు సరికొత్త సవాలును విసురుతుంది. అయితే ఇటీవల కాలంలో ChatGPT యాప్‌ను ఎంతోమంది పలు విధాలుగా పరీక్షించారు, అలాగే ఉపయోగించారు కూడా. అయితే ఇప్పుడు ఇదే యాప్ గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా ఒక విమాన ప్రయాణికురాలు తమ విమానం ఆలస్యం అయినందుకు ఎయిర్‌లైన్స్‌కు ఈ మెయిల్ పంపడానికి AI ఆధారిత ChatGPT యాప్‌ను ఉపయోగించారు. ఆరు గంటల పాటు ఫ్లైట్ ఆలస్యం అయినందుకు మహిళ తాను ఈ మెయిల్ రాయకుండా ChatGPTకు ఎయిర్‌లైన్స్‌కు మర్యాదపూర్వకంగా ఈ మెయిల్ రాయమని చెప్పడంతో, అది టకటక అత్యంత ఖచ్చితమైన మ్యాటర్‌ను రాసింది. ఈ విషయాన్ని సదురు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే "ఇది భవిష్యత్తు. ChatGPT ద్వారా ఏ ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి? అని పోస్ట్ చేసింది. ఈ సంఘటన ద్వారా ChatGPT కి సంబంధించిన క్రేజ్ మరింతగా పెరిగింది.

Advertisement

Next Story