మరిన్ని దేశాలకు శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్స్

by Harish |   ( Updated:2023-03-08 12:24:21.0  )
మరిన్ని దేశాలకు శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమర్జెన్సీ టైంలో వినియోగదారులకు సహయపడటానికి శాటిలైట్ ఆధారిత(SOS)ని తీసుకొచ్చిన ఆపిల్ సంస్థ, ఇప్పుడు ఆ సదుపాయాన్ని మరిన్ని దేశాలకు విస్తరించింది. ఇది ఫోన్‌లో సిగ్నల్స్, Wi-Fi అందుబాటులో లేనప్పుడు, iPhone యూజర్లు శాటిలైట్ ద్వారా ఇతరులకు కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. iOS 16.1 లేదా తర్వాతి వెర్షన్‌లో నడుస్తున్న iPhone 14, iPhone 14 Pro మోడల్‌లలో ఉపగ్రహం ద్వారా అత్యవసర SOSని సేవలను పొందవచ్చు.


మొదటగా ఈ ఫీచర్ కెనడాలో మాత్రమే అందుబాటులో ఉండేది. తరువాత UK, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్‌లకు విస్తరించింది. ఇప్పుడు కొత్తగా ఆరు దేశాలు.. ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్‌లోని వినియోగదారులకు ఈ నెలలో ఈ ఫీచర్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఏదైనా అత్యవసర సమయంలో సిగ్నల్స్ లేని చోటు నుండి సహాయం పొందడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలగువారితో కమ్యూనికేట్ కావడానికి శాటిలైట్ ఆధారిత(SOS) ఫీచర్, ఎంపిక చేసిన ఆపిల్ ఫోన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది.

Advertisement

Next Story