Google Maps‌లో AI పవర్డ్ ఫీచర్స్!

by Harish |   ( Updated:2023-10-27 10:22:19.0  )
Google Maps‌లో AI పవర్డ్ ఫీచర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇటీవల వరుసగా తన అప్లికేషన్లలో AI ఫీచర్లను ప్రవేశపెడుతుంది. ఇప్పటికే సెర్చింగ్ ఆప్షన్‌లో, స్కానర్‌లో కొత్త ఆప్షన్లను తెచ్చిన కంపెనీ తాజాగా Google Maps‌ లో కూడా AI పవర్డ్ ఫీచర్స్‌ను తెస్తుంది. దీని ద్వారా యూజర్లకు మెరుగైన నావిగేషన్‌ను అందించవచ్చని గూగుల్ పేర్కొంది. ‘ఇమ్మర్సివ్ వ్యూ’ తో దారిని అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నడక లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు యూజర్లకు ఇది బాగా సహాయపడుతుంది. వెళుతున్న దారిలో ట్రాఫిక్ అప్‌డేట్స్‌ను, వాతావరణ పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు. ఈ వారం ఆమ్‌స్టర్‌డామ్, బార్సిలోనా, డబ్లిన్, ఫ్లోరెన్స్, లాస్ వెగాస్, లండన్, లాస్ ఏంజెల్స్, మయామి, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సీటెల్, టోక్యో, వెనిస్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అలాగే, యూజర్లు తమ చుట్టుపక్కల ఉండే దుకాణాలు, ఈవీలకు చార్జింగ్ స్టేషన్లు, రెస్టారెంట్లు, ATMల గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి Google Lens in Maps ఫీచర్‌ను కూడా తీసుకువస్తోంది. ఈ ఫీచర్లు భారత్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed