Whatsapp సరికొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్ సేవింగ్ అవసరమే లేదు..

by Harish |   ( Updated:2023-07-18 18:34:28.0  )
Whatsapp సరికొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్ సేవింగ్ అవసరమే లేదు..
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆప్షన్‌ను విడతల వారీగా విడుదల చేస్తుంది. నెంబర్‌ను కాంటాక్ట్‌గా సేవింగ్ చేయకుండానే ఆ నెంబర్‌‌ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా మెసేజ్‌ చేసే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేస్తున్నట్లు WABetaInfo నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ గురించి యూజర్లు చాలా రోజుల నుంచి కంపెనీని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు iOS, Androidలో కొన్ని డివైజ్‌లలో ఇది అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ కోసం వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత స్టార్ట్ న్యూ చాట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మెసేజ్ చేయాల్సిన నెంబర్‌ను ఎంటర్ చేయగానే సంబంధిత ఆప్షన్ ఎనెబుల్ అవుతుంది. తెలియని నెంబర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఆ నెంబర్లను సేవ్ చేసుకోవాల్సి వస్తుంది, అనవసర నెంబర్లను సేవ్ చేయకుండా డైరెక్ట్‌గా మెసేజ్ చేసే ఆప్షన్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story